Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరురూరల్
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని పటేల్ గూడెం శాఖా మహాసభను భీమ గాని నర్సయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై 22, 23 తేదీల్లో నిరాహార దీక్షలు ,25న ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడ,ి 29, 30్ల కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.అనంతరం గ్రామశాఖాకార్యదర్శిగా నీలిగొండ వాలి, సహాయ కార్యదర్శిగా గ్యార భాస్కర్లను ఎన్నుకునఆనరు. ఈ కార్యక్రమం లో. బొమ్మకంటి లక్ష్మీనారాయణ ,కాల్వా నర్సిరెడ్డి, కొండ సుధాకర్ రెడ్డి ,పొన్నగాని లక్ష్మీనారాయణ, రాజు, తదితరులు పాల్గొన్నారు.