Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామన్నపేట:మండల వ్యాప్తంగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీిఐ(ఎం) ఆధ్వర్యంలో ఈనెల 23, 24 లలో మండల కేంద్రంలో నిర్వహించే నిరసన దీక్షలను, 25న నిర్వహించే తహసీల్దార్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేక అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో శాఖ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమాత్రం అభివద్ధికి నోచుకోని రామన్నపేట మండలం పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి కాలువలు పూర్తిచేయాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, మండల వ్యాప్తంగా 600 మంది అర్హులైన వారు మూడేండ్లుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. వెంటనే పెన్షన్లు రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు పులి బిక్షం అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జెల్లేల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోయిని ఆనంద్, గాదే నరేందర్, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, గన్నేబోయిన విజయభాస్కర్, మేడి గణేష్, శానాగొండ వెంకటేశ్వర్లు, జనపాల లక్ష్మణ్, గుండాల బిక్షం, మల్లారెడ్డి, గోగు లింగస్వామి, గొరిగె సోములు, అవనగంటి నగేష్ ,తదితరులు పాల్గొన్నారు.