Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
మల్లు నాగార్జున రెడ్డి
సూర్యాపేట: కుల గణనపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ ద్వంద నీతి వైఖరి విడనాడాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హిందూ రాజ్య స్థాపనకు కులగణన ఆటంకంగా మారుతుందనే భయంతోనే కేంద్రంలోని మోడీ సర్కార్ సుప్రీంకోర్టుకు తప్పుడు అఫిడవిట్లు సమర్పించిందని తెలిపారు. 2021 జనాభా లెక్కల ప్రకారమే కుల గణన చేయాలని డిమాండ్ చేశారు. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయాలని డిమాండ్ చేసినప్ప టికీ, బీజేపీ అధికారంలో ఉండి కూడా 2021 జనాభా గణన సందర్భంగా కులగణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.