Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ -వలిగొండ
ప్రజా సమస్యల పరిష్కారం ఈనెల 22 23 తేదీల్లో నిరాహార దీక్షలు, 25న నిర్వహించనున్న ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ పిలుపునిచ్చారు సోమవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సమావేశం మెరుగు వెంకటేశం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమైందన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు కొన్ని ప్రాంతాల్లో నిర్మించి పేదలకు ఇవ్వడం లేదన్నారు. రేషన్ కార్డులు, పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని, గ్రామాల్లో అంతర్గత రోడ్లు పునర్నిర్మించాలని , అర్రూరు నుండి వలిగొండ వరకు బీటీ రోడ్డు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ , జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాలరాజు రామ్‌చందర్, కొండె కిష్టయ్య, మొగిలిపాక గోపాల్, గాజుల ఆంజనేయులు, వాకిటి వెంకటరెడ్డి, బుగ్గ చంద్రమౌళి, దుబ్బ లింగం భీమన్న ,బోయ జంగయ్య ,కర్ణకంటి యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.