Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
స్థానిక గ్రామంచాయతీలో స్వీపర్‌గా పని చేస్తున్న నోముల లింగమ్మ ఆదివారం అనారోగ్యం తో మృతి చెందింది. ఈ మేరకు ఎంపీడీవో వెంకటాచారి, సర్పంచ్ తూముల శ్వేత సురేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తూముల భుజంగరావు, ఎంపీవో నరేష్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం నుంచి రూ.10 వేలు, సర్పంచ్ శ్వేతసురేష్ స్వతహాగా మరో రూ.10 వేలు మృతురాలి కుటుంబానికి సోమవారం అందజేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం నుంచి మరో రూ.10 వేలు సహాయం అందిస్తామని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ధనియకుల శ్రీనివాస్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రవి, పంచాయితీ కార్యదర్శి చంద్రశేఖర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు తూముల సురేష్‌రావు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి రణపంగ కృష్ణ, వార్డు సభ్యులు పిడమర్తి నాగమణి, సిబ్బంది శ్రావణ్, మట్టయ్య పాల్గొన్నారు.