Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్ పహాడ్
హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ పరిరక్షించాలని డీఆర్డీవో పీడీ సుందరి కిరణ్ కుమార్ కోరారు. మండలంలోని పెన్పహాడ్, సింగారెడ్డిపాలెం గ్రామపంచాయతీ పరిధిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్న మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ పనులను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో వెంకటాచారి, ఎంపీవో నరేష్, ఏపీవో రవి, సింగరెడ్డిపాలెం సర్పంచ్ షరీఫ్, పంచాయతీ కార్యదర్శులు చంద్రశేఖర్, వెంకటేష్ పాల్గొన్నారు.