Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
పద్యం తెలుగువారి సొత్తు అని, అజరామరంగా వేల ఏండ్లుగా పద్యం విలసిల్లుతున్నదని దీనిని ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దాశరధి పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య అన్నారు. మెతుకు సీమ సాహితీ సాంస్కతిక సంస్థ ఆధ్వర్యంలో ప్రచురించిన సుమారు ఆరు వందలకుపైగా కవుల పద్య సంకలనం పద్య ప్రభంజనం పుస్తక పరిచయసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నల్లగొండలోని బీసీ స్టడీ సర్కిల్లో జరిగిన ఈ పుస్తకం పరిచయ సభకు డాక్టర్ ఎం.పురుషోత్తమాచార్య సభాధ్యక్షులుగా వ్యవహరించారు.ఈ సందర్భంగా కూరెళ్ల విఠలాచార్య మాట్లాడుతూ నాటినిజాం వ్యతిరేక పోరాటంలోనూ ఇటీవల తెలంగాణ ఉద్యమంలోనూ పద్యం విశేషమైన పాత్ర పోషించిందన్నారు.విశిష్ట అతిథిగా విచ్చేసిన పద్య ప్రభంజనం సంపాదకులు, అష్టావధాని అవుసుల భానుప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణలోని పద్యకవులందర్ని ఒక తాటి పైకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ బహత్సంకలనం వెలువరిం చామన్నారు.అష్టావధాని అయితగోని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పద్యం ధారణాశక్తిని పెంచుతుందని, పద్యం తప్పకుండా నేటితరం విద్యార్థులకు అందించాలని ఆకాంక్షించారు. ప్రముఖ యోగాచార్యులు మాదగాని శంకరయ్య మాట్లాడుతూ పద్య సాహిత్యాన్ని నల్లగొండ కవులు గొప్పగా సజిస్తున్నారని, పద్యం ఎన్నటికీ కనుమరుగు కాదన్నారు.సాగర్ల సత్తయ్య సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బెల్లి యాదయ్య, పున్న అంజయ్య, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, శీలాఅవిలేను, మొగలిమాల, రాపోలు అరుణ, లింగంపల్లి హేమలత, దాసోజు జ్ఞానేశ్వర్, రావిరాల అంజయ్య, చింతోజు మల్లికార్జునాచారి పాల్గొన్నారు.