Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నకిరేకల్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రద్దు చేసేంత వరకూ పోరాటం ఆగదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం పట్టణంలోని పార్టీ భవన్లో ఆ పార్టీ మండల మహాసభ మర్రి వెంకటయ్య, చెన్నబోయిన నాగమణి, సాకుంట్ల నర్సింహ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వ్యవసాయ చట్టాలకు వ్యతి రేకంగా జరుగుతున్న సమైక్య ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించాలని సూచించారు.గతంలో ప్రభుత్వం సూచించిన కందిని రైతులు సాగుచేసిన కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేక పోయిందన్నారు.దీంతో ప్రభుత్వంపై రైతులకు నమ్మకంపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.రాబోయేకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.ఈ మహాసభలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మలవీరారెడ్డి, కందాల ప్రమీల, జిట్ట నగేష్, బొజ్జ చిన్నవెంకులు, మండలకార్యదర్శి రాచకొండ వెంకట్‌గౌడ్, నాయకులు మర్రివెంకటయ్య, వంటెపాక వెంకటేశ్వర్లు, కొప్పులఅంజయ్య, పుట్టసత్తయ్య, అక్కెనపల్లి సైదులు, మండలచంద్రయ్య, పుట్ట ముత్తిరాములు పాల్గొన్నారు.