Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి
నవతెలంగాణ- రామన్నపేట
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి, సీపీిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జల్లేల పెంటయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మండలం లోని నిర్నేముల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యపు రాశులను వారు పరిశీలించి మాట్లాడారు. ఐకేపి, పీఏసీఎస్ కో-ఆపరేటివ్ సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 50శాతం ధాన్యం ఇప్పటికే రాసులుగా పోసి రైతులు ఎదురు చూస్తున్నారన్నారు. కొనుగోళ్లు ప్రారంభించి , మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొమ్మాయిగూడం గ్రామంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ నాయకులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం నాయకులు బోయిని ఆనంద్, శాఖ కార్యదర్శులు శానగొండ వెంకటేశ్వర్లు, బండ జగన్మోహన్ రెడ్డి, పోలగోని స్వామి, పొట్లచెర్వు నాగయ్య, కల్లూరి జంగయ్య, బోయపల్లి రామలింగయ్య, బాత్క మారయ్య, దగ్గుల యాదయ్య, లింగయ్య పాల్గొన్నారు.