Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం
నవతెలంగాణ- భువనగిరిటౌన్
కార్మిక హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెంక టేశం విమర్శించారు. మంగళవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన ఆ సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్స్‌ను తీసుకొచ్చిందన్నారు. ఈ నెల 31న జరిగే ఏఐటీయూసీ 102వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.గోరిగే నర్సింహా అధ్యక్షత నిర్వహించిన ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్, పిల్లి శంకర్, కూరెళ్ల మచ్చగిరి, అన్నేమైన వెంకటేష్ పాల్గొన్నారు.