Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టరేట్ ఎదుట కేవీపీఎస్ ధర్నా
నవ తెలంగాణ- నల్లగొండ
రాష్ట్రంలో ఇటీవల దళితులపై అనేక కుల వివక్ష దాడులు,దౌర్జన్యాలు,కులాంతర వివాహితుల హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు చైర్మెన్‌ను నియమించాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు కేవలం హుజూరాబాద్‌కే కాకుండా నల్లగొండ జిల్లాలోని ప్రతి పేద దళిత కుటుంబానికీ అందజేయాలని కోరారు. మూడేండ్లుగా ఎస్సీ కార్పొరేషన్ ఇండిస్టియల్ ద్వారా అందుతున్న రుణాలకు సబ్సిడీలు ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, దళితులకు మూడెకరాల భూపంపిణీ, డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, జిల్లా ఉపాధ్యక్షులు రెమడాల పరశురాములు, సహాయ కార్యదర్శి జిట్టా నగేష్, జిల్లా సహాయ కార్యదర్శి గండమల్ల రాములు, జిల్లా ఉపాధ్యక్షులు గాదె నర్సింహ ,జిల్లా కమిటీ సభ్యులు బొల్లు రవీందర్ కుమార్ ,దొంతాల నాగార్జున, బొంగరాల వెంకులు, దైదా జనార్దన్, మల్లయ్య ,వంటెపాక కష్ణ, కొదమగుండ్ల వెంకన్న ,బడే అజరుకుమార్, అరుణకుమారి, రేణుకా పట్టణ అధ్యక్షులు నర్సింహా, విజరు, తదితరులు పాల్గొన్నారు.
దళిత బంధును రాష్ట్ర మంతట అమలుచేయాలి
భువనగిరిటౌన్ : దళిత బంధువు రాష్ట్రమంతా అమలు చేయాలని, ఎస్సీ కార్పొరేషన్ పెండింగ్ రుణాలు ఇవ్వాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అన్నంపట్ల కష్ణ అన్నారు. గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ ఏఓకు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి సిర్పంగి స్వామి జిల్లా నాయకులు నిలిగొండ కిశోర్, పల్లెపాటి రామస్వామి, స్వప్న,లక్ష్మమ్మ, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.