Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కోటాచలం
సూర్యాపేట:ఉప్పులో అయోడిన్ లేక పోవడం వల్లే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కోటాచలం పేర్కొన్నారు. గురువారం వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జాతీయ అయోడిన్ లోప వ్యాధుల నివారణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అయోడిన్ లోపం దేశంలో ప్రధాన ఆరోగ్య సమస్యగా మారిందన్నారు. అయోడిన్ లోపంతో స్త్రీకి గర్భస్రావం, మృత శిశవు జననం, అనువంశిక జనన లోపాలు, తక్కువ బరువు కలిగిన శిశువుకు జన్మనివ్వడం, నరాల లోపాలు వంటి సమస్యలు వస్తున్నాయని తెలిపారు. దేశంలో 90 శాతం ప్రజలకు అయోడిన్‌ను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వాలు కార్యక్రమాలను ప్రవేశ పెడుతున్నాయని తెలిపారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా అసంక్రమిత వ్యాధుల అధికారి కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి వెంకటరమణ, సాహితీ, డాక్టర్ జయ, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ శ్రీనివాసరాజు, డాక్టర్ వినరు ఆనంద్, డాక్టర్ నాజియా, డెమో అంజయ్య, జిల్లా ఆరోగ్య బోధకులు మధుసూదన్‌రెడ్డి, భాస్కర్‌రాజు, భూతరాజు సైదులు, యాదగిరి, డాక్టర్ వీరేందర్, విజయ, కృష్ణమూర్తి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.