Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-మిర్యాలగూడ
భౌతిక రసాయన, వైద్య, శాంతి, సాహిత్యం వృత్తిలో విశేష పేరు సంపాదించిన వ్యక్తులకు నోబెల్ బహుమతి ఇస్తారని సామాజికవేత్త రాజారత్నం అన్నారు. గురువారం మండలంలోని అవంతిపురం గ్రామంలో వైస్ ప్రిన్సిపాల్ అజరు కుమార్ అధ్యక్షతన నోబెల్ 188వ జయంతిని పురస్కరించుకొని గిరిజన బాలుర గురుకుల కళాశాలలో నివాళులర్పించి మాట్లాడారు. మిలటరీ ఆయుధాల తయారీ కోసం పాత ఇనుము, స్టీల్ మిల్లును తీసుకొని బోఫోర్స్ ఆయుధాలను తయారు చేసిన గొప్ప వ్యక్తి నోబెల్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సక్రు, సికిందర్, మంగయ్య, జానకీ రాములు, రోశయ్య, రమేష్, బాలరాజు, అశోక్ పాల్గొన్నారు.