Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నికార్సైన దేశభక్తుడు మనోహర్ పంతులు : మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి
- మా ఊరి పంతులు పోయిండు : జనంపల్లి గ్రామస్తులు
- మనోహర్ పంతులు పార్థివదేహాన్ని సందర్శించడానికి తరలివచ్చిన జనం
అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు
నవతెలంగాణ -రామన్నపేట
మండలంలోని జనంపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, శతాధిక వద్ధుడు, జనం మనిషి వేమవరం మనోహర్ పంతులు పార్థివదేహాన్ని సందర్శించడానికి ప్రముఖులతో పాటు సామాన్య జనం తండోపతండాలుగా తరలివచ్చారు. పార్థివదేహాన్ని సందర్శించి కన్నీటి పర్యంతమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
మనోహర్ పంతులు నికార్సయిన దేశభక్తుడు..
వేమవరం మనోహర్ పంతులు నిఖార్సైన దేశభక్తుడని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. జనంపల్లి గ్రామంలో ఆయన పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆయన ఎన్నో సామాజిక ఉద్యమాలకు స్ఫూర్తి దాయకమన్నారు. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎనలేని కషి చేశారన్నారు.
సమాజహితం కోరుకునేవాడు..
మనోహర్ పంతులు నిరంతరం సమాజ హితమే కోరుకునే వారని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశభక్తిని విద్యార్థులకు నూరిపోసే వాడని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పంతులు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తుది శ్వాస వరకు మానవత్వాన్ని వీడలేదు
దేశ స్వాతంత్య్రం కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధాన పాత్రధారి అయిన వేమవరం మనోహర్ పంతులు తుది శ్వాస వరకు మానవత్వాన్ని సామాన్య జనానికి సహాయసహకారాలు అందించే తత్వాన్ని వీడలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి అన్నారు. మనోహర్ పార్థివదేహంపై వారు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. మంచికి మారు పేరుగా 102 ఏండ్లు జీవించారన్నారు. మనోహర్ మరణంతో త్యాగాల రక్తం పోయిందని ఆయన పోరాట పటిమను నేటి యువతరం కొనసాగించాలని వారు సూచించారు.
పేదలకు ఉన్నత విద్యలో అందించిన మహౌన్నతుడు..
జనం మనిషి ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు వేమవరం మనోహర్ పంతులు ఎంతోమంది పేద విద్యార్థులకు తన సొంత డబ్బులు వెచ్చించి ఉన్నత విద్యను అందించిన మహోన్నతుడు మనోహర్ పంతులు అని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం జనంపల్లి గ్రామంలో మనోహర్ పంతులు పార్థివదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు.
మనోహర్ పంతులు సోషలిస్టు..
ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వేమవరం మనోహర్ పంతులు సనాతన కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడైనా అభ్యుదయ వాది అని ఆయన సోషలిస్టు భావాలు కలిగి ఉండేవాడిని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్ రెడ్డి అన్నారు. నిరంతరం జనం క్షేమం కోసం వారి అభివద్ధి కోసం పరితపించే వారిని వారన్నారు.
విద్య, సాహిత్య, సాంస్కతిక పోషకుడు..
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు జనం మనిషి వేమవరం మనోహర్ పంతులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎంతోమందికి విద్యతో పాటు సాహిత్య సాంస్కతిక రంగంలో రాణిస్తున్న యువతకు మంచి తోడ్పాటును అందించే వారని ఆయన మరణం రామన్నపేట ప్రాంతానికే కాకుండా తెలంగాణ సమాజానికే తీరని లోటని దాశరథి పురస్కార గ్రహీత ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కూరెళ్ళ విఠలా ఆచార్య, సాహితీ మిత్రమండలి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ తండు కష్ణ కౌండిన్య, బాసరాజు యాదగిరి అన్నారు. ఆయన భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఆచార్య కూరెళ్ల విఠలాచార్య స్మరించుకున్నారు.
నివాళులర్పించిన ప్రముఖులు
శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మెన్ నేతి విద్యాసాగర్ రావు, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, చౌటుప్పల్ ఆర్డీఓ సూరజ్ కుమార్, నార్మాక్స్ చైర్మెన్ గంగుల కష్ణారెడ్డి, స్థానిక తహసీల్దార్ వలిగొండ ఆంజనేయులు, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ బెల్లి యాదయ్య,పీఏసీఎస్ చైర్మెన్ నంద్యాల బిక్షం రెడ్డి, వివిధ పార్టీల నాయకులు మందడి ఉద రు రెడ్డి, జల్లెల్ల పెంటయ్య, ఊట్కురి నరసింహ, సాల్వే రు అశోక్, ఎండి.జమీరోద్దీన్, పున్న రమేష్, కుల, సాహిత్య, సంస్కత రంగాల నాయకులు నివాళులర్పించారు.
మా ఊరి దిక్కు పోయిండు
మనోహర్ పంతులు మరణవార్తను విన్న వెంటనే గ్రామంతో పాటు మండలం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అనేక మంది తరలివచ్చి పంతులు పార్థివదేహాన్ని సందర్శించారు. అనేక మంది ఆయన అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి నివాళులు అర్పించారు. 'మా ఊరి దిక్కు పోయిందని, మా ఊరి పంతులు మాకు అందకుండా పోయారు'అని గ్రామవాసులు, మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ చిన్న సమస్య బాధ ఉన్న చెప్పుకునే వాళ్ళం అని ఆయన పరిష్కరించే వారిని కూడా దిక్కు లేకుండా పోయిందని పలువురు మహిళలు పేర్కొంటూ కన్నీరు పెట్టుకున్నారు.