Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్పీ రాజేంద్ర ప్రసాద్
నవతెలంగాణ- కోదాడరూరల్
గంజాయి మత్తులో ప్రమాదకరమైన నేరాలు చేసే అవకాశం ఉందని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ లో గంజాయిపై నిర్వహించిన అవగాహనలో ఆయన మాట్లాడారు. గంజాయి లేని సమాజాన్ని భావితరాలకు అందించే బాధ్యత ఖాకీ యూనిఫామ్‌పై ఉందన్నారు. రామాపురం క్రాస్ రోడ్డు సమీపంలో ప్రతి వాహనాన్నీ ఖచ్చితంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ రఘు, సీఐలు నరసింహారావు, శివరాంరెడ్డి, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసు స్టేషన్ తనిఖీ
ఎస్పీ యస్.రాజేంద్రప్రసాద్ శుక్రవారం స్థానిక పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లోని పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో గంజాయి కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లోనూ ప్రత్యేక నిఘా ఉంచాలని, హాట్స్పాట్స్లను గుర్తించి పని చేయాలని ఆదేశించారు. ఆయన వెంట స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చివ్వేంల ఎస్సై విష్ణు, పీఎస్ఐ సిబ్బంది ఉన్నారు.