Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిర్యాలగూడలో 21 కిలోలు.. ముగ్గురిఅరెస్టు- రిమాండ్
- చింతపల్లిలో 1100 గ్రాములు కొండమల్లేపల్లిలో రెండు కిలోలు పట్టివేత
నవతెలంగాణ-మిర్యాలగూడ
జిల్లావ్యాప్తంగా పోలీసులు శుక్రవారం 24కిలోల గంజాయిని పట్టుకున్నారు. మిర్యాల గూడలో 21కిలోల గంజాయిని పట్టుకోగా చింతపల్లిలో 1100 గ్రాములు, కొండమల్లేపల్లిలో రెండుకిలోల గంజాయిని పట్టుకున్నారు. 21 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్న సంఘటన మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది.సీఐ సురేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని రవీంద్రనగర్ కాలనీకి చెందిన స్కూల్ బస్సు డ్రైవర్ భూక్యా రమేష్ మండలంలోని మైసమ్మ కుంటతండాకు చెందిన బానోతు కొండయ్య, మండలంలోని కురియాతండాకు చెందిన ధనావత్ శ్రీను అధిక డబ్బులు సంపాదించాలని ఆశతో ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు ప్రాంతంలో సురేష్ అలియాస్ వెంకట్ వద్ద 21 కిలోల గంజాయిని కొనుగోలు చేసి చిన్నచిన్న ప్యాకెట్లుగా చేశారు.తెల్లవారుజామున అవుట్ గేట్ వద్ద యువకులకు విక్రయిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు టూటౌన్ పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు.వారి నుండి 21 కిలోల గంజాయి, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.కోర్టుకు రిమాండ్ చేశారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
1100 గ్రామల గంజాయిపట్టివేత
చింతపల్లి :1100 గంజాయిని పోలీసులు పట్టుకున్న సంఘటన మండలకేంద్రంలోని సాయిబాబా గుడి వద్ద శుక్రవారం చోటు చేసుకుంది.నాంపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సాకు చెందిన రుషికేష్‌నాయక్ ఒరిస్సా నుండి తన ముగ్గురు స్నేహితులతో కలిసి హైదరాబాద్‌కు గంజాయిని తీసుకెళ్తున్నాడు.పోలీసులు దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద 1100 గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.తహసీల్దార్ విశాలాక్షి సమక్షంలో పంచనామా నిర్వహించారు. కేసును నాంపల్లి సీఐ సత్యం దర్యాప్తు చేస్తున్నారు.
రెండు కిలోల గంజాయిపట్టివేత
కొండమల్లేపల్లి : రెండుకిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్న సంఘటన పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లోశుక్రవారం చోటుచేసుకుంది.ఎస్సై భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాలప్రకారం..శుక్రవారం సాధారణ తనిఖీలో భాగంగా పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అతని వద్ద ఉన్న రెండుకిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు కోర్టుకు రిమాండ్ చేశారు.తహసీల్దార్ సరస్వతి, ఆర్ఐ శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో పంచనామా నిర్వహించారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.