Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆత్మకూర్ఎం: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న దేవినేని అరవింద రాయుడు రచించిన నాని వికలాంగులు అనే పుస్తకానికి గాను భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రశంసిస్తూ, ప్రశంస పత్రాన్ని పంపిన సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో దేవినేని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు దొడ్డి స్వామి, కట్ట రమేష్, దడిపెల్లి వెంకన్న, సంఘం మండల అధ్యక్షులు దర్శనం వెంకన్న ,ప్రధాన కార్యదర్శి జూకంటి కర్ణాకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్ రెడ్డి ,సంఘం నాయకులు శ్రావణ్, రాజు, కష్ణ, రవి, అశోక్, సునీత, హరిత తదితరులు పాల్గొన్నారు.