Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమర్ధవంతంగా పనిచేసే అధికారులకు పదోన్నతులు, మెడల్స్, నగదు ప్రోత్సాహకాలు
- యువతను కాపాడాల్సిన బాధ్యత మనదే
- సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాలి
- డీఐజీ రంగనాథ్
నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
గంజాయి కారణంగా నిర్వీర్యమవుతున్న యువతను కాపాడడంతో పాటు నల్లగొండ ను గంజాయి రహిత జిల్లాగా మార్చడం లక్ష్యంగా అన్ని స్థాయిలో పోలీస్ అధికారులు నిబద్ధతతో పని చేయాలని డీఐజీ రంగనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గంజాయి విక్రయాలు, రవాణా, వినియోగంపై చాలా సీరియస్గా ఉన్నదనే విషయాన్ని గుర్తు చేశారు. గంజాయి కారణంగా యువత భవిష్యత్తు నిర్వీర్యం అవుతున్నదని, దీనివల్ల దేశ అభివద్ధి, భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని చెప్పారు. యువత గంజాయి, మత్తు పదార్ధాలకు బానిసలుగా మారి విచక్షణ కోల్పోయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల యువత సైతం గంజాయి సేవించే స్థాయికి గంజాయి విక్రయాలు పెరిగాయన్నారు. అందువల్ల క్షేత్రస్థాయి నుండి పోలీస్ అధికారులు సమాచార వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవాలన్నారు. ఎక్కడ గంజాయి విక్రయం, సేవించనా సమాచారం తెలుసుకునేలా ప్రజలతో మమేకం కావాలని పోలీస్ అధికారులకు సూచించారు. గంజాయి కేసుల విషయంలో అరెస్టులు, సీజ్ చేయడంతో పాటు అన్ని కోణాలలో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. గంజాయి అంశంలో ఎలాంటి రాజకీయ
గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి జోక్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. గంజాయి విక్రయం, రవాణా, సేవిస్తున్న అంశాలను సులువుగా తీసుకోవద్దని, ఇది చాలా తీవ్రమైన సమస్యగా గుర్తించి అన్ని స్థాయిల పోలీస్ అధికారులు మరింత బాధ్యతాయుతంగా, సమర్ధంగా పని చేయాలన్నారు.కేసుల నమోదు, విచారణ, సెక్షన్లు, పాటించాల్సిన నిబంధనలు, కోర్టులో సమర్పించాల్సిన పత్రాలు, తదితర అంశాలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వేణు పోలీస్ అదికారులకు అవగాహన కల్పించారు.
ఏవోబీ ఆపరేషన్ అధికారులకు ప్రత్యేక అభినందన
గంజాయి ముఠాలను పట్టుకోవడం కోసం ఏవోబీ ప్రాంతంలో మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి, ప్రాణాలకు సైతం తెగించి గంజాయి విక్రయదారులను తీసుకువచ్చేందుకు వెళ్లిన జిల్లా టాస్క్ ఫోర్స్, పోలీస్ బందాలను ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణ పట్ల నిబద్ధతతో పాటు సమాజం పట్ల బాధ్యతతో అద్భుతమైన పనితీరు కనబర్చి నల్లగొండ జిల్లా పోలీసుల సత్తాను చాటారన్నారు.
గంజాయి విషయంలో సమర్ధవంతంగా పనిచేసే అధికారులకు ప్రభుత్వం పలు రకాల ప్రోత్సాహకాలు ప్రకటించిందని తెలిపారు. యాక్సిలరీ పదోన్నతులతో పాటు మెడల్స్, నగదు ప్రోత్సాహకాలు అందించనున్నదని చెప్పారు. ఈ సమావేశంలో డీటీసీ ఎస్పీ సతీష్ చోడగిరి, అదనపు ఎస్పీనర్మద, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, రమణా రెడ్డి, సురేష్ కుమార్, సీిఐలు బాలగోపాల్, చంద్రశేఖర్ రెడ్డి, రౌతు గోపి, నాగరాజు, పీఎన్డీ ప్రసాద్, శంకర్ రెడ్డి, మధు, శ్రీనివాస్, గౌరు నాయుడు, వెంకటేశ్వర్లు, సత్యం, రాఘవులు, ఆర్ఐలు నర్సింహా చారి, స్పర్జన్ రాజ్, ఎస్ఐలు విజరు కుమార్, నాగరాజు, యాదయ్య, సుధీర్, నర్సింహా రావు, శివ కుమార్, నర్సింహా, రాజశేఖర్, పరమేష్, తదితరులు పాల్గొన్నారు.