Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లావ్యాప్తంగా 58 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు
- హాజరుకానున్న 16854 మంది విద్యార్థులు
- పరీక్షాకేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
నల్గగొండ :అక్టోబర్ 25 నుండి నవంబర్ 3 వరకు జరిగే ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.జిల్లావ్యాప్తంగా 58 పరీక్షాకేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.పరీక్షలకు జిల్లావ్యప్తంగా 16854 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు.ఆదివారం పరీక్షా కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసు కుంటున్నామని అధికారులు తెలిపారు. ప్రతి పరీక్షాకేంద్రం వద్ద శానిటైజర్, మాస్క్‌లు, థర్మల్ స్క్రీనింగ్ అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసు కుంటున్నారు.జిల్లా అధికారులు అన్ని కేంద్రాలకు చీఫ్ సూపెరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు, మంచినీరు ఏర్పాటుతో పాటు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థులకు సమయాను కూలంగా బస్సుసౌకర్యం, ప్రథమ చికిత్స, అంబులెన్స్, ప్రతి కేంద్రం వద్ద పొలీస్ బందోబస్తు, 144 సెక్షన్ అమలు, జీరాక్స్ కేంద్రాల మూసివేతకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సంబంధిత అధికారులను ఆదేశించారు.విదార్థులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కు ధరించి, శానిటైజర్‌తో ఒక గంట ముందు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు రావాలని అధికారులు సూచించారు.
కోవిడ్ నిబంధనల నడుమ ఇంటర్ పరీక్షలు
ఇంటర్ బోర్డు అధికారి దస్రునాయక్
సోమవారం నుంచి జరిగే ఇంటర్ మొదటి ఫస్టియర్ పరీక్షలు కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహిస్తాం.పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా శానిటైజర్, మాస్క్‌లు తెచ్చుకోవాలి.పరీక్షకు గంటముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను అనుమతించం.