Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
బాల్యం నుంచే పొదుపు చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి కోరారు. మంగళవారం మండలంలోని చందుపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచే పొదుపు అలవాటు చేసుకొని లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదవాలని కోరారు. డిజిటల్ లావాదేవీలపై విద్యార్థుల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎంపీపీ నరాల నిర్మల వెంకట స్వామి యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులకు పొదుపు పై అవగాహన కల్పించిన ఏపీజీవీబీను అభినందించారు. నాబార్డ్ డీఓఎం వినరు కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలని, వాటి ద్వారా వివిధ రకాల పథకాల ద్వారా లబ్ది పొందవచ్చని తెలిపారు. ఏపీజీవీబీ కళాజాత చే మ్యాజిక్ షో వివిధ రకాల సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉపన్యాస, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్నభోజనాన్ని, దాత బల్గురి ప్రభాకర్ రెడ్డి సహకారంతో పాఠశాలలో ఏర్పాటు చేసిన టాయిలెట్స్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిన్నం పాండు, ఎంపీటీసీ కొండల్ రెడ్డి, ఎంఈఓ అండాలు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామకష్ణ, ఆర్ ఎం విజయ భాస్కర్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్, టాయిలెట్ నిర్మాణ దాత బాల్గురి ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.