Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రూ.కోటి అంచనా వ్యయంతో కొత్త రోడ్లకు శంకుస్థాపన
అ రూ.కోటీ 25 లక్షలతో మూడు కొత్త పార్కుల నిర్మాణం
అ నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి జగదీష్ రెడ్డి
అ ఏర్పాట్లు పరిశీలించిన మున్సిపల్ సిబ్బంది
నవతెలంగాణ - సూర్యాపేట
సూర్యాపేట పట్టణం రోడ్ల విస్తరణతో సుందరీకరణ జరుగుతున్న నేపథ్యంలో మంత్రి జగదీష్‌రెడ్డి కొత్త రోడ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో పట్టణ రోడ్లకు మహర్దశ పట్టినట్లైంది. రూ.కోటీ 25 లక్షల అంచనా వ్యయంతో మూడు కొత్త పార్కులు నిర్మించాలన్న మంత్రి జగదీష్ రెడ్డి నిర్ణయంతో పట్టణ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టణంలోని సద్దుల చెరువు సమీపంలో రూ.50 లక్షలతో నిర్మించ తలపెట్టిన పార్క్‌తో పాటు రెండు పడకల ఇండ్ల నిర్మాణంతో పట్టణంలో పేరొందిన ఇందిరమ్మ కాలనీలో రూ.50 లక్షలతో, ముత్యాలమ్మ గుడి వెనుక భాగంలో రూ.25 లక్షల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన పార్కులకు శనివారం ఉదయం మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రోడ్ల విస్తరణతో కొత్త సొగసులు అద్దుకుంటున్న పట్టణంలో మారుమూల కాలనీలకు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించాలన్న మంత్రి జగదీష్ రెడ్డి సంకల్పం మేరకు రూ.14 లక్షల అంచనా వ్యయంతో అంబేడ్కర్ నగర్లో, రూ.40 లక్షల అంచనా వ్యయంతో 27వ వార్డు పరిధిలోని ఆర్కే గార్డెన్ సమీపంలో, అదే విధంగా 13 వార్డు పరిధిలోని అంజనాపూరి కాలనీలో రూ.45 లక్షల అంచనా వ్యయంతో నిర్మించ తల పెట్టిన కొత్త రోడ్ల నిర్మాణాలకు మంత్రి జగదీశ్‌రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మున్సిపల్ అధికారులు తెలిపారు.