Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
జిల్లాకేంద్రంలోని యూటీఎఫ్ భవనంలో ఈనెల 21న బ్లూస్కార్ఫ్ నవల పుస్తక పరిచయసభ సాయంత్రం జరుగనున్నదని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు కట్ట ప్రభాత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.తెలుగు నేల మీద రెండు దశాబ్దాల కింద జరిగిన వీరోచిత విద్యుత్ ఉద్యమ నేపథ్యంలో ఎం.విప్లవకుమార్ అక్షరీకరించిన నవల బ్లూస్కార్ఫ్ అని పేర్కొన్నారు.ఎన్జీ కళాశాల ఆంగ్లోపన్యాసకులు చిలుముల సుధాకర్ అధ్యక్షతన జరుగనున్న ఈ నవల పరిచయ సభకు ముఖ్యఅతిధిగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డా.పసునూరి రవీందర్, విశిష్ట అతిథులుగా రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బెల్లి యాదయ్య , ప్రజాసైంటిస్ట్ జెవివి రమేష్ , అమ్రాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ టి.సుధారాణి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్.మూర్తి, డీవైఎఫ్ఐ మాజీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, డీవైఎఫ్ఐ జిల్లా మాజీ అధ్యక్షులు జంజిరాల సైదులు, జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ హాజరవుతున్నట్టు తెలిపారు.సభకు పుర ప్రముఖులు, విద్యార్థులు, యవత హాజరై జయప్రదం చేయాలని కోరారు.