Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
మండలపరిధిలోని ఖాశీంపేట గ్రామంలో గాస్పాల్ టీవీ వారు నిర్వహిస్తున్న సూపర్‌సింగర్ సెషన్-3 పోగ్రాం కరపత్రాలను బిషప్ సీహెచ్.సాల్మన్‌రాజు విడుదల చేశారు.ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ బిషప్ డాక్టర్ దుర్గంప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరిగే సూపర్‌సింగర్ పోగ్రాంలో పాల్గొనేందుకు ఈనెల డిసెంబర్ 12 వరకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500 చెల్లించి పేరు నమోదు చేసుకోవాలన్నారు.ఈ పోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రసంశాపత్రం, ప్రత్యేకబహుమతి అందించబడుతుందన్నారు.జిల్లావ్యాప్తంగా ప్రతిచర్చి నుండి యువతీ యువకులు, పాస్టర్స్ పాటలు పాడే వారు అధికసంఖ్యలో పాల్గొ నాలన్నారు.ఈ కార్యక్రమం గాస్పాల్ టీవీలో ప్రత్యేక ప్రసారం చేయబడు తుందన్నారు.ఇక్కడ క్వాలిఫై అయిన వారు హైదరాబాద్‌లో నిర్వహించే పోగ్రాంలో పాల్గొంటారన్నారు.ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించు ఫోన్ నెంబర్ 99129 71446 మీ సంఘం కాపరి ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేయించు కోవచ్చనితెలిపారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ సిమోన్,నెహేమ్యా, డేవిడ్, ఉపేందర్ పాల్గొన్నారు.