Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మైనార్టీలపై జరిగే దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం అవలంబించిన విధానాలు, మతపరమైన దాడులను నిరసిస్తూ నినాదాలు చేశారు.ధర్నాకు ముస్లిం వెల్ఫేర్ సొసైటీ, ఇతర ప్రజాసంఘాలు, ముస్లిం మతపెద్దలు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ముస్లిం మైనారిటీలపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శిం చారు.త్రిపురరాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తుంద న్నారు. మసీదులను, సిపిఎం పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయడం, ముస్లిముల దుకాణాలపై దాడులకు పాల్పడి ఆర్ధిక నష్టం కలిగించడం, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడడం చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా బిజెపి పాలిత రాష్ట్రాలలో ముస్లింలు, క్రిస్టియన్లు,దళితులపై దాడులు చేస్తున్నారని చెప్పారు. మైనార్టీలపై మతోన్మాద దాడులను అరికట్టాలని, నిర్వాసితులకు ఆర్థిక పరిహారం అందించి ఆదుకోవాలని, దాడులకు పాల్పడే దుండగులను గుర్తించి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దేశవ్యాప్తంగా మైనార్టీలపై జరిగే దాడులను అరికట్టి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు వీరపల్లి వెంకటేశ్వర్లు, డా. మల్లు గౌతమ్‌రెడ్డి, రవి నాయక్, పరశురాములు, అంజద్, అయ్యూబ్, మంగారెడ్డి, వినోద్‌నాయక్, ఖాజామోయినుద్దీన్, ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మహమ్మద్చావుస్, సమీఖాద్రి, సాజిద్‌ఖాన్, మార్కస్పాషా, గోవర్దని, ఊర్మిల, ఖాదర్, బాబు నాయక్, యేసు, రామారావు, బొంగరాలవెంకటయ్య, ఇక్బాల్, పాపానాయక్, బాలసైదులు, సుల్తాన్, బాసిద్, ఉబేద్ పాల్గొన్నారు.