Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అదేశాలమేరకు మండలపరిధిలోని భక్తాలపురం, గాజులమల్కాపురం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ నెమ్మాదిభిక్షం, పీఏసీఎస్ చైర్మెన్లు వెన్న సీతారాంరెడ్డి, నాతాల జానకిరాంరెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతన్నలు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని వానాకాలంలో పండించిన వరి పంటను ప్రభుత్వం కొంటుందని, అదేవిధంగా యాసంగి పంటలపై రైతన్నలకు పలు సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు దొంగరి యుగంధర్, గ్రామసర్పంచ్ ఓంకారం, వార్డు సభ్యులు నల్లపు రామ్మూర్తి ,జుట్టుకొండ గణేష్, నల్లపు శ్రీరాములు, నీలాల సతీష్, నెమ్మాది జానకిరాములు, రైతులు పాల్గొన్నారు.