Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏకగ్రీవగ్రామపంచాయతీ వీధులన్నీ మురికికూపాలే
చినుకుపడితే చిత్తడిచిత్తడి..
సమస్యలు పట్టని సర్పంచ్
నవతెలంగాణ-మోతె
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గ్రామాలకు సరిహద్దులో ఉన్న మోతె మండలంలోని నర్సింహాపురం నూతనంగా ఏర్పడిన ఏకగ్రీవ గ్రామపంచాయతీ.పేరుగొప్ప..ఊరు దిబ్బ అన్న చందంగా గ్రామంలో సమస్యలు కుప్పలుతెప్పలుగా పేరుకుపోయాయి.ఊరు ప్రజలు రెక్కాడితే డొక్కా నిండుతాయి. పగలు కష్టపడి ఇంటికొచ్చి కునుకు తీద్దాం అంటే, దోమల భయంతో అల్లాడుతున్నారు. ఆ గ్రామ జనాభా వెయ్యికి పైగా ఉన్నట్టు సమాచారం.గ్రామ ప్రారంభం నుండి చివరివరకు డ్రయినేజీ సమస్యతో విలవిలలాడుతున్నారు.మురికికాలువలు తీయడం లేదని, పూడినపోయి వీధుల్లో నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతుంది.దోమలు వ్యాప్తి చెందుతున్నాయి.సమస్యలెన్ని ఉన్నా సర్పంచ్ మాత్రం కనీసం పట్టించుకున్న పాపానప ఓవడం లేదు. గ్రామ శివారులో 150 మంది ముదిరాజ్ కులస్తులు తంగెళ్ల బజారులో నివసిస్తున్నారు. ఆ ప్రాంతంలో పరిస్థితులు మరీ ఘోరంగా ఉన్నాయి.వీధుల్లో నీరు నిలిచి పిల్లలు,వద్ధులు వాహనాలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది.ఊరు పక్కనే మెట్ట ప్రాంతం నుండి వర్షపు నీరు ఇండ్లలోకి చేరి నివాసానికి కూడా అనుకూలంగా లేదని ఆ ప్రాంత వాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.ఆ నివాస స్థల ప్రజలు బురదలో జారిపడిన పరిస్థితి కోకొల్లలు . గ్రామంలో చెత్తాచెదారం తొలగించడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి.1999, 2004లో ఉన్న ఎమ్మెల్యే గోపాల్కాలంలో ఇంటి స్థలాలు వచ్చినా నేటికీ పాలకులు ఇండ్లు నిర్మించిన పాపాన పోలేదు.30 ఏండ్లుగా డ్రయినేజీ సమస్యతో తల్లడిల్లుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.దీంతో తమ ఇండ్లలోకి నీటి సరఫరాకు సొంతంగా పైపులు వేసుకున్నామని గ్రామస్తులు పేర్కొంటున్నారు.నీళ్లు సరఫరా చేసే వ్యక్తికి ఏడాదికి ఇంటికి రూ.200 చెల్లిస్తున్నారు.చాలా ఇండ్లలోకి నేటికీ బాత్రూం, మరుగుదొడ్లు లేవు.గ్రామానికి వస్తున్న జనరల్ ఫండ్ 14వ ఆర్థికనిధులు, ఎస్ఎఫ్సీ నిధులు దేనికి ఖర్చు చేస్తున్నారో తెలియడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు గ్రామాన్ని సందర్శించి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.