Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
వీర జవాన్ అనుములపురి వెంకటేశ్వర్లు దేశానికి చేసిన సేవలు మరువలేనివని మున్సిపల్ చైర్పర్సన్స్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.సోమవారం జిల్లాకేంద్రంలోని 8వ వార్డులోని అపూర్వ బధిరుల పాఠశాలలో సూర్యాపేటకు చెందిన వీరజవాన్ తన సోదరుడు వెంకటేశ్వర్లు 42వ జయంతి ఈ సందర్భంగా విద్యార్థులకు భోజనం, పండ్లు, బిస్కెట్లు,పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. దేశరక్షణలో మన సూర్యాపేట కీర్తిపతాకాన్ని ఎగుర వేసి పేరు ప్రఖ్యాతులను తెచ్చిన వెంకటేశ్వర్లును దేశం మర్చిపోదన్నారు.ఆయన ఆశయసాధన కోసం సామాజిక సేవాకార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు తల్లి దండ్రులు అనుములపురి లక్ష్మమ్మనర్సయ్య, ,సోదరి హైమావతి, మామలు బొల్లెద్దుదశరథ, బుచ్చి రాములు, ఉపాధ్యాయ నాయకులు జానకిరాములు, మాజీ కౌన్సిలర్ రాంబాయమ్మ,కట్ట రాజేశ్వరి, 9వ టీిఆర్ఎస్ అధ్యక్షులు నాగభూషణం, టీఆర్ఎస్ నాయకులు నీలాల లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి దంతాలసాయి, యూత్ అధ్యక్షులు మచ్చరాము, వరుణ్, శైలేందర్, రఘునాని, ప్రిన్సిపల్ మదనాచారి, పాఠశాల సిబ్బంది సరిత, భవాని, రాజు పాల్గొన్నారు.