Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్పహాడ్
మండలకేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కంద్రాన్ని జాతీయ నాణ్యతాహామీ ప్రమాణాల సంస్థ రాష్ట్ర టీం ఆ సంస్థ రాష్ట్ర మేనేజర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సోమవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్ర ంలో రికార్డులను, ఆవరణను పరిశీలి ంచారు. జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాలకు అనుగుణంగా ఆరోగ్య కేంద్రాన్ని ఏ విధంగా చూసుకోవాలో, ఏయే మార్పులు చేయాలో వివరిం చారు.జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాల ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేసి ఉండగా రాష్ట్ర టీం సందర్శించినట్టు స్థానిక వైద్యాధికారి వినరు ఆనంద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్క్యూఏఎస్ జిల్లా మేనేజర్ అరుణ, పీహెచ్సీ వైద్యాధికారి మణిదీప్, కిరణ్, హెచ్ఈఓలు చంద్రశేఖర్, భువనేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.
.