Authorization
Thu May 01, 2025 09:43:12 pm
నవతెలంగాణ -మోత్కూరు
ధరణి పోర్టలలో భూసమస్యలు పరిష్కరించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు డిమాండ్ చేశారు. గురువారం మున్సిపల్ కేంద్రంలోని సుందరయ్య కాలనీలో ఆ పార్టీ సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్ తప్పుల తడకగా మారిందన్నారు. సర్వే నంబర్లు, భూముల పూర్తి వివరాలు అసమగ్రంగా ఉన్నాయని, దీంతో రైతులు వాటి పరిష్కారం కోసం చెప్పులరిగేలా తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. పెండింగ్ లో ఉన్న సాదాబైనామాలకు పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల, పట్టణ కార్యదర్శులు గుండు వెంకటనర్సు, కూరపాటి రాములు, నాయకులు చామకూర శోభ, బక్కయ్య, కళమ్మ, బాలరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.