Authorization
Sat May 03, 2025 03:57:24 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో మంగళవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు ఏడుమేకల మహేష్ యాదవ్ మాట్లడుతూ రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు వడ్ల కల్లాలపై ప్రాణాలు వదిలిన రైతుల కుటుంబాలను పరామర్శించకుండా వారికి కనీస ఎక్స్గ్రేషియా ప్రకటించకుండా రైతు సంబరాలు జరుపుకోవడం సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో పుట్ట కిష్ణ ,ఏలకొండ ప్రవీణ్ ,ముంత రాజు ,కొసన శ్రీకాంత్ ,రాసాల శివ ,ముంత నర్సింహ్మ ,మాకోలు యాదయ్య ,పేరబోయిన కొండయ్య పాల్గొన్నారు.