Authorization
Sat May 03, 2025 08:54:45 pm
నవతెలంగాణ -ఆలేరురూరల్
మండలంలోని శ్రీనివాసపురం గ్రామానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ వడ్ల నవ్య శోభన్ బాబు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే రూ.24లక్షల నిధులు మంజూరు చేయడం పట్ల బుధవారం హర్షం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రం భవనానికి రూ.8లక్షలు, ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనానికి రూ.8 లక్షలు, మల్టీ పర్పస్ భవన నిర్మాణానికి రూ. 8 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు.