Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డబ్బికార్మల్లేశ్
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఈనెల 22న సాయంత్రం 4 గంటలకు జరిగే సీపీఐ(ఎం) ఆన్లైన్ బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేశ్ కోరారు. స్థానికంగా జరిగిన పార్టీ కార్యదర్శి వర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీపీఐ(ఎం) 3వ మహాసభలు తుర్కయంజాల్లో ఈనెల 23, 24, 25 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ సందర్భంగా 22వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఆన్లైన్ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. కావున ప్రజలు పెద్ద సంఖ్యలో ఆన్లైన్ బహిరంగ సభ ను సీపీఐ(ఎం)తెలంగాణ వెబ్ పేజీలో వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. ఈ బహిరంగ సభలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్, బీవీ రాఘవులు మహాసభల విశిష్టత, పాలకుల ప్రజావ్యతిరేకత విధానాలు, సీపీఎం పోరాటాల పైన ప్రసంగిస్తారని తెలిపారు. దేశ సమైక్యతకు భంగం కలిగిస్తున్న బీజేపీ విధానాలను ఎండగట్టాలని కోరారు. కమ్యూనిస్టుల బలం పెరిగితేనే పేదలకు రక్షణ అని అన్నారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, సీనియర్ నాయకులు పగిదోజు రామూర్తి, నాయకులు పిల్లుట్ల సైదులు, గోవిందరెడ్డి, బాబునాయక్, సైదమ్మ, రామకృష్ణ, పొదిల శ్రీను పాల్గొన్నారు.