Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరు రూరల్
విద్యతో పాటు క్రీడలు ఆడితే మానసికోల్లాసం కలుగుతుందని కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్ల గూడెం గ్రామంలో సిఎస్ఐ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో వారు పాల్గొని మాట్లాడుతూ యువత ముందుకు నడవాలంటే విద్యతో పాటు ఆటలు కూడా అవసరమని తెలిపారు. అనంతరం బ్యాటు బహుకరించారు. క్రీడాకారులు కలిసి వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్ ,పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఏజాజ్ ,మండల అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అజరు, మండల యూత్ అధ్యక్షుడు లోకేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు అంజయ్య ,నాయకులు జాంగిర్, మురళి, ప్రశాంత్ ,శివ ,మధు, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.