Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉమ్మడి నల్లగొండ జిల్లా చింతపల్లి ఘటన మరువక ముందే మరో ఘటన
అ ఎస్.లింగోటం లో రైతు పశువుల కొట్టంలో పూజలు
అ బొమ్మ పెట్టి,నిమ్మకాయలు కోసి పూజలు చేసిన వైనం
అ భయాందోళనలో గ్రామస్తులు
అ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, వస్తువులను స్వాధీనం చేసుకున్న చౌటుప్పల్ ఎస్సై దైదా అనిల్
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూఢనమ్మకాలు మరోసారి వెల్లువెత్తుతున్నాయి.చింతపల్లి మండలంలో మహంకాళి వద్ద ఓ వ్యక్తి తల నరికిన సంఘటనకు పక్షం రోజులు కూడా గడవలేదు.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఎస్.లింగోటం గ్రామంలో ఓ రైతు పశువుల దొడ్డిలో క్షుద్రపూజలు ఉమ్మడి జిల్లాలోనే కలకలం రేపుతున్నాయి. ప్రపంచం విజ్ఞానం వైపు పరుగులేడుతుంటే,పల్లెల్లో మాత్రం ఇంకా మూఢ విశ్వాసాలు మర్రి ఊడల్లా అల్లుకుంటూనే ఉన్నాయి.గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా కొంత మంది క్షుద్రపూజల పేరుతో అశాంతిని సష్టించేలా తయారయ్యారు.
-ఎస్.లింగోటంలో రైతు పశువుల కొట్టంలో..
హైదరాబాద్ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న చౌటుప్పల్ మండలంలో పదేండ్ల క్రితం ఖైతాపురంలో మంత్రాల నెపంతో ఓ వద్ధున్ని సజీవదహనం చేశారు. అప్పటి నుండి మండలంలో పెద్దగా క్షుద్రపూజల సంఘటనలు వెలుగులోకి రాలేదు. మండలంలోని ఎస్.లింగోటం గ్రామంలో ఉప్పు కష్ణ అనే రైతు పశువుల కొట్టంలో గుర్తుతెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి చేసిన క్షుద్రపూజలు కలకలం రేపాయి. శనివారం సాయంత్రం వరకు రైతు వ్యవసాయ బావి వద్దే ఉన్నాడు. సాయంత్రం గేదల నుండి పాలు తీసుకొని సుమారు రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి వెళ్లాడు. ఆదివారం తెల్లవారుజామున పాలు పితకడానికి పశువుల కొట్టంకు వెళ్లాడు.పశువుల కొట్టంలోనికి వెళ్లే దారిలోనే కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, కొబ్బరికాయ కొట్టి, బట్టతో చేసిన బొమ్మను పెట్టి క్షుద్రపూజలు చేశారు. కొట్టంలోని గేదెలు లేసి ఉండడంతో అనుమానం వచ్చి చూసే సరికి పొగ వస్తుండడం గమనించాడు. ఇదేమని అక్కడకు వెళ్లి చూడగా అసలు విషయం తెలిసింది. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు సంఘటనాస్థలానికి చేరుకొని క్షుద్రపూజలు చేసిన తీరును పరిశీలించారు. ఈ వార్త మండలంలోని పలు గ్రామాలతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటన జరగలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఎవరో కావాలని రైతు మనోధైర్యంని దెబ్బదిసేలా ఇలాంటి పని చేసి ఉంటారని గ్రామస్తులు అంటున్నారు.
-క్షుద్రపూజల సామగ్రిని స్వాధీనం చేసుకున్న చౌటుప్పల్ ఎస్సై దైదా అనిల్
క్షుద్రపూజల విషయం చౌటుప్పల్ పోలీసులకు సమాచారం అందింది. దీనితో పోలీసులు రంగంలోకి దిగి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చౌటుప్పల్ ఎస్సై దైదా అనిల్ క్షుద్రపూజలు చేసిన చోట ఉన్న బట్టతో చేసిన బొమ్మను,కత్తిని,గాజులు,ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రైతును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంత మంది మండలంలో గుప్త నిధుల కోసం ఇలాంటి పూజలు చేస్తున్నట్టు కొంత సమాచారం ఉందని అన్నారు.ఇలాంటి పూజలను నమ్మవద్దని కోరారు. క్షుద్రపూజల పేరుతో కొంత మంది చేస్తున్న ఆగడాలను అరికడతామని తెలిపారు. గ్రామస్తులు ఎలాంటి భయాందోళనకు గురి కావొద్దని సూచించారు. ఈ సంఘటనను పోలీస్ ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.