Authorization
Fri May 02, 2025 03:45:41 am
నవతెలంగాణ-భువనగిరిరూరల్
హైదరాబాద్లోని గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ల ఆధ్వర్యంలో పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్రెడ్డి మాట్లాడారు.యాదాద్రి భువనగిరి జిల్లాలో డిజిటల్ సభ్యత్వ నమోదు విజయవంతంగా కొనసాగుతుందన్నారు.జిల్లాలో పేదలకు వైద్యం అందించేందుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సేవలందించాలని, ఏయిమ్స్లో అన్ని రకాల సేవలు ప్రారంభించాలని పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు అందరూ జిల్లా సమస్యలపై పోరాటం చేస్తున్నారన్నారు.రైతులకు సాగునీరు అందించేందుకు చిన్న నీటి కాలువలను పూర్తి చేయాల్సి ఉందన్నారు.యువత ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు.