Authorization
Fri May 02, 2025 08:13:25 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పచ్చిమట్టల పెంటయ్య జీవితం చిరస్మరణీయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.మంగళవారం మల్లు వెంకట నర్సింహారెడ్డి భవన్లో పచ్చిమట్టల పెంటయ్య ప్రథమవర్థంతి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో పార్టీని, సీఐటీయూను అగ్ర భాగంలో నిలబెట్టడంలో పెంటయ్య చేసిన కషి మరువలేనిదన్నారు.ఆయన జీవితాంతం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. పట్టణంలోని అనేక ప్రాంతాలలో పేదలకు ఇండ్లు,స్థలాలు కావాలని పేదలను సమీకరించి ఎన్నో గుడిసెలు వేసి పోరాడి అనేకమందికి ఇండ్ల స్థలాలు ఇప్పించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కమిటీసభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు కొలిశెట్టి యాదగిరి రావు, ధీరావత్ రవినాయక్, బుర్రి శ్రీరాములు, మట్టిపల్లి సైదులు, ఎల్గూరిగోవింద్, కోటగోపి, మేదరమెట్ల వెంకటేశ్వర్రావు, పారేపల్లి శేఖర్‌రావు, కొదమగుండ్ల నగేష్ ,షేక్ యాకుబ్, దేవరం వెంకట్‌రెడ్డి, కందాల శంకర్‌రెడ్డి, పులుసుసత్యం, మద్దెలజ్యోతి, కొప్పులరజిత, ధనియాకుల శ్రీకాంత్, వీరబోయినరవి, వేల్పులవెంకన్న, చెరుకు యాకలక్ష్మి, మేకనబోయిన సైదమ్మ, పల్లె వెంకట్‌రెడ్డి,మేకన బోయినశేఖర్, దుగ్గి బ్రహ్మం, వట్టెపు సైదులు, మిట్టమడుగుల ముత్యాలు, బెల్లంకొండ సత్యనారాయణ, చిన్నపంగ నర్సయ్య పాల్గొన్నారు.