Authorization
Sat May 03, 2025 11:08:35 am
- గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన దీక్ష
- నీటి సరఫరాను నిలిపి వేసిన పంచాయతీ సిబ్బంది
నవతెలంగాణ -సంస్థాన్‌నారాయణపురం
అఖిలపక్ష నాయకుల పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఎంపీపీ ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి దౌర్జన్యానికి అండగా నిలుస్తున్న ఎస్ఐని సస్పెండ్ చేయాలని, ఆక్రమిత స్థలాన్ని రక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చేసి అఖిలపక్ష నాయకులకు మద్దతు నిలిచారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అంగడి స్థలాన్ని కబ్జా చేసిన ఉమా ప్రేమ చందర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రేమ చందర్ రెడ్డి కి వత్తాసు పలుకుతున్న ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం మండలాధ్యక్షులు ఘనం నరసింహ, సర్పంచ్ షకీలా మెట్ల శ్రీహరి, ఉప సర్పంచ్ ఉప్పర గొని సంజీవ, అఖిలపక్ష నాయకులు మందుల బాలకష్ణ, చిలువేరు అంజయ్య, సూర్య పల్లి శివాజీ, బద్దుల యాదగిరి,రాచకొండ గిరి, చిలువేరు కష్ణ, వార్డు మెంబర్లు ఎం డి ముస్తఫా ఖాన్, ఉప్పర కొన్ని యాదయ్య, నాయకులు చిలువేరు బిక్షం మేడం సాయి గణేష్, కొండ యాదగిరి, ఉప్పరబోయిన నగేష్, ఎర్రోళ్ల లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.