Authorization
Thu May 01, 2025 01:42:27 am
నవతెలంగాణ- ఆలేరుటౌన్
మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద మహానీయుల సావిత్రి బాయి ఫూలే ,జ్యోతిరావు ఫూలే, ఆరుట్ల రామచంద్రారెడ్డి ,సుశీలాదేవీ, విగ్రహాల వద్ద బస్టాండ్ ఆవరణలో సులబ్కాంప్లెక్స్ నిర్మించొద్దని డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్, మండల కార్యదర్శి చవుడబోయిన కనకయ్య ,పట్టణ కార్యదర్శి శ్రీనివాసరాజు ,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పరశురాములు, ఆంజనేయులు ,నర్సింలు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.