Authorization
Fri May 02, 2025 09:26:18 pm
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
కేరళ రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజా పంపిణీ విధానం దేశానికి ఆదర్శంగా ఉందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు అన్నారు.మే 28 నుండి 31 వరకు కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో నగరంలోని ఈఎంఎస్ అకాడమీలు జరుగుతున్న శిక్షణా తరగతుల నిమిత్తం కేరళ వచ్చిన సందర్భంగా కేరళ వామపక్ష ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల స్థితిగతుల ఆధారంగా ప్రజాపంపిణీ వ్యవస్థను నాలుగుభాగాలుగా విభజించి ప్రజలకు నిత్యావసర వస్తువులను అందిస్తూ వామపక్ష ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. పేదవాడి కడుపు నింపేందుకు ఏడు రకాల నిత్యావసర వస్తువులను ప్రజా పంపిణీ ద్వారా అందజేయడం అభినందనీయమన్నారు. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు కేరళ వామపక్ష ప్రభుత్వం ప్రజా పంపిణీ ద్వారా 17 రకాల నిత్యావసర వస్తువులను గతంలో అందించడం జరిగిందన్నారు.ఆయన వెంట ఆ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు మెరుగుసత్యనారాయణ, సిద్దిపేట జిల్లా కార్యదర్శి రాళ్ళబండి శశిధర్ ఉన్నారు.