Authorization
Thu May 01, 2025 01:51:16 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
మండలంలోని బొల్లేపల్లి, సిరివేణి కుంట గ్రామాలలో కొనసాగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మండల స్పెషల్ ఆఫీసర్ ,జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు ఎంపీడీవో గుత్తా నరేందర్‌రెడ్డితో కలిసి మంగళవారం తనిఖీ చేశారు.పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న వర్క్‌లను పరిశీలించడంతోపాటు పలుసూచనలు చేశారు.బొల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పరిసరాల శుభ్రతను పరిశీలించారు.నర్సరీలో మొక్కల పెంపకం పరిశీలించారు.వైకుంఠదామాలలో చేపడుతున్న చర్యలను అడిగి తేలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో బొల్లేపల్లి సర్పంచ్ మద్ది బుచ్చిరెడ్డి, సిరివేణికుంట సర్పంచ్ పడాల అనితవెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.