Authorization
Sat May 03, 2025 03:18:13 am
- పలుగ్రామాల్లో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు
నవతెలంగాణ-చివ్వెంల
ప్రభుత్వం మనఊరు-మన బడి ప్రొఫెసర్ డాక్టర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఈ నెల 30వ వరకు నిర్వహిస్తుంది.కానీ బడిబాట కార్యక్రమంలో మండలకేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొనకుండా తూతూమంత్రంగా బడిబాట కార్యక్రమం సాగుతుందని 'నవతెలంగాణ' మినీలో ప్రచురితమైన కథనానికి ఉపాధ్యాయులు, టీచింగ్సిబ్బంది, హాస్టల్ వార్డెన్ స్పందించారు.గురువారం లక్ష్మీనాయక్తండా పరిధిలోని తండాలలో ప్రభుత్వ గిరిజనఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టీచింగ్సిబ్బంది బడిబాట కార్యక్రమం నిర్వహించారు.