Authorization
Fri May 02, 2025 07:29:35 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
బృహత్ పల్లె ప్రకృతి వనం కార్యక్రమంలో భాగంగా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ తనిఖీ చేసారు. అనంతరం వడాయిగూడెం గ్రామ పరిధిలో జరుగుతున్న పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా అడిషనల్ కలెక్టర్ గ్రామ పరిధిలోని నర్సరీ, సాగ్రిగేషన్ షెడ్ ను ఇతర పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. నామాత్ పల్లి గ్రామంలో చెత్త కంపోస్ట్ చేసే విధానం పరిశీలించారు. గ్రామాలలో తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం వల్ల గ్రామ అభివద్ధికి అవసరమయ్యే వర్మి కంపోస్ట్ తయరు చేసి బలంగా మొక్కలను పెంచేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఆయన వెంట ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్ , మున్సిపల్ కమిషనర్ నాగి రెడ్డి , ఎంపిడిఓ గుత్తా నరేందర్ రెడ్డి ఉన్నారు.