Authorization
Sat May 03, 2025 04:48:45 am
నవతెలంగాణ-దేవరకొండ
నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికై సిపిఐ ఆధ్వర్యంలో సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం దేవరకొండలోని స్థానిక పల్లా పర్వత్రెడ్డిభవన్లో జిల్లా నాయకులు బొడ్డుపల్లి వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం గత ఎనిమిదేండ్లుగా సంస్కరణల పేరుతో ఆర్థిక, పారిశ్రామిక, సాంసతికరంగాలలో తిరోగమన విధానాలు చేపడుతూ చాపకింద నీరులాగా హిందూమతోన్మాద విధానాలను ప్రోత్సహిస్తూ లౌకిక, ప్రజాస్వామ జాతీయ విధానానికి భంగం కలిగించే విధంగా విధానాలు చేపడు తుందన్న్షారు.దేవరకొండ, మునుగోడు నియోజకవర్గ గ్రామాలకు తాగు, సాగునీరు అందించే దిండి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన సింగరాజుపల్లి, క్రిష్టరాయంపల్లి, చర్లగూడెం రిజర్వాయర్ పనులు నత్తనడకలో ఉన్నాయన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ఆర్ఆర్ ప్యాకేజీ కింద నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేంతవరకు దశలవారీగా పార్టీ ఆధ్వర్యంలో సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.ఈ సమావేశంలోరాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు తూం బుచ్చిరెడ్డి, మండల కార్యదర్శులు పార్లపల్లి కేశవరెడ్డి, శ్రీరామదాసు కనకాచారి, పోలె వెంకటయ్య, ఉప్పు నూతలవెంకటయ్య, కుంభం జయ రాములు, గుమ్మ కొండ వెంకటేశ్వర్‌రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి మైనోద్దీన్, సహాయకార్యదర్శి నూనెరామస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వలమల్ల ఆంజనేయులు, దేపా సుదర్శన్‌రెడ్డి, పట్టణ కార్యదర్శి జూలూరి వెంకట్రాములు, ఏఐటీయూసీ డివిజన్ అధ్యక్షులు నూనె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.