Authorization
Sat May 03, 2025 09:05:29 pm
- డిప్యూటీ డీఎంహెచ్ఓ హర్షవర్ధన్
నవతెలంగాణ-అర్వపల్లి
గ్రామాల్లో ప్రజలకు ఉద్ధత నీళ్ళవిరోచనాలు నివారణ పక్షోత్సవాలను వైద్యసిబ్బంది సక్రమంగా నిర్వహించాలని డిప్యూటీ డీఎంహెచ్వో హర్షవర్ధన్ అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వైద్యశాలను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమం వివరాలను ఇంటింటికి వెళ్లి తెలుసుకున్నారు. ఉధత నీళ్ల విరేచనాల నివారణ పక్షోత్సవం కార్యక్రమలో భాగంగా ఇంటింటికీ తిరిగి పిల్లల తల్లులకు జింక్ మాత్రలు ఆశా కార్యకర్తలు ఇస్తున్నారా..లేదా ? అని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రోగ్రామ్ ను 13.06.2022 నుండి 27.06 2022 వరకు నిర్వహిం చాలన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్, సీహెచ్ఓ చరణ్, వెంకట్రావమ్మ,స్వాతి, లక్ష్మీనారాయణ, నాగరాణి పాల్గొన్నారు.