Authorization
Fri May 02, 2025 01:34:02 am
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు
నవతెలంగాణ -భువనగిరి/భువనగిరిరూరల్
ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు పారితోషకం కాకుండా ఫిక్స్డ్ వేతనం రూ.21వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశావర్కర్ల కోరికల దినోత్సవం సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్న విధంగా కనీస వేతనం చెల్లించాలని కోరారు. చట్టపరమైన హక్కులు కల్పించాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం పాత బస్టాండ్ ఎదుట రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా నాయకులు కసగోని లలిత. మండల అధ్యక్షురాలు జ్యోతి. సంతోష, పుష్ప, అలివేల, చంద్రకళ, అరుణ, సుజాత పాల్గొన్నారు.