Authorization
Fri May 02, 2025 10:55:56 am
నవతెలంగాణ-నాగార్జునసాగర్
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన(టీడబ్ల్యూజేఎఫ్్) నాగార్జున సాగర్ నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆదివారం నాగార్జునసాగర్‌లోని విజయవిహార్‌లో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్ నాగార్జున సాగర్ నియోజకవర్గ మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు గాదె రమేష్, జిల్లా అధ్యక్షులు ఆయుబ్ ముఖ్యాతిధులుగా పాల్గొని నాగార్జున సాగర్ నియోజకవర్గ టీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షునిగా మూల శేఖర్‌రెడ్డి (పెద్దవూర), ఉపాధ్యక్షులుగా ఆవుల నరేందర్, శ్రీనివాస్, చందూలాల్, కార్యదర్శిగా నామలింగయ్య, సహాయ కార్యదర్శులుగా నడ్డి శివకృష్ణ యాదవ్, ఇబ్రహీం, కరుణాకర్, సాయికృష్ణ, కోశాధికారిగా కే.మల్లయ్య, కార్యవర్గ సభ్యులుగా ప్రకాష్, తిరుపతయ్య, తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి జర్నలిస్ట్‌కు నూతన కార్యవర్గం ధన్యవాదాలు తెలిపారు.