Authorization
Thu May 01, 2025 03:53:32 pm
నవతెలంగాణ-మఠంపల్లి
ఈనెల 23న జరిగే కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లాప్రధానకార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు పిలుపునిచ్చారు.ఆదివారం మండలంలోని రఘునాధపాలెంలో జరిగిన హమాలీల సమావేశంలో ఆయన మాట్లాడారు.రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలను అదుపు చేయడంలో పాలకులు విఫలమయ్యారన్నారు.పెట్టుబడిదారులకు అనుకూలమైన చట్టం తీసుకొస్తూ అన్ని వర్గాల ప్రజలపై పెనుభారాలు మోపుతోందన్నారన్నారు.పాలకుల తీరు ఎండగట్టేందుకు అన్ని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి ఉంటుందని,ఈముట్టడిని జయప్రదం చేయాలని కోరారు.ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు శీలం శ్రీను, సంఘం మండలకన్వీనర్ ఎస్డీ.రన్మియా, షేక్భాషా, పాషా, మస్తాన్, బ్రహ్మయ్య పాల్గొన్నారు.