Authorization
Fri May 02, 2025 10:29:29 pm
నవతెలంగాణ-బీబీనగర్
ఈనెల 24న వలిగొండలో నిర్వహించనున్న భవన నిర్మాణ కార్మిక జిల్లా మూడో మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బండారు శ్రీరాములు కోరారు.సోమవారం మండల కేంద్రంలోని బ్రాహ్మణపల్లి కూడలి వద్ద మహాసభ కరపత్రాలను విడుదల చేశారు.అనంతరం ఆయన మండల కన్వీనర్ గాడి శ్రీనివాస్ కలిసి మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం నిర్మాణ కార్మికులకు సంబంధించిన చట్టాలను వలస కార్మికుల చట్టాలను నీరుగారిచేందుకు కుట్ర చేస్తుందని అన్నారు, కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ తేచ్చిందని విటీని వేంటనే ఉపసంరించుకోవాలని డిమాండ్ చేశారు, రాష్ట్రంలో సంక్షేమ బోర్డు ద్వారా అమలు అవుతున్న పథకాలు యాక్సిడెంట్ డెత్‌కు రూ.10 లక్షలు, సహజమరణాలకు రూ. 500000, వివాహ ప్రసూతిలకు లక్షరూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల నాయకులు గడ్డమీద కృష్ణ, బండ యాదగిరి, గాడి నగేష్, కృష్ణ, భాను ప్రకాష్, బానోతు అశోక్ నాయక్, పాల్గొన్నారు.