Authorization
Sat May 03, 2025 10:46:06 am
కోదాడరూరల్:సీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు కార్మికులకు పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని ఆ సంఘం కార్యాలయంలో జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడలో అక్టోబర్ 30,31వ తేదీలలో సీఐటీయూ జిల్లా మహాసభలు జరుగుతున్నాయని ఈ మహాసభలలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు జరుగుతాయన్నారు.జిల్లా మహాసభలకు సంఘటిత,అసంఘటితరంగ, ఉద్యోగులు, కార్మికులు హాజరుకావాలని కోరారు.అనంతరం ఆహ్వానసంఘం కమిటీని ఎన్నుకున్నారు.ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ప్రధానకార్యదర్శి మిట్టగనుపుల ముత్యాలు, కోశాధికారి కోటగిరి వెంకట్నారాయణను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎం.రాంబాబు, ఎస్.రాధాకృష్ణ ,ఏ.లక్ష్మీ, వరలక్ష్మీ, స్వరాజ్యం, సుందరయ్య, రణపొంగు కృష్ణ, సాయికుమార్, సైదులు తదితరులు పాల్గొన్నారు.