Authorization
Fri May 02, 2025 07:03:17 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
పట్టణంలో సైబర్నేరాలపై బాటసారులకు,వాహనదారులకు ఎస్సై కట్ట వెంకటరెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలు ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యాయని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. మీకు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ నెంబర్ చెప్పమని, లక్కీ డ్రాలు వచ్చాయని మభ్యపెడుతూ మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను కాజేస్తున్నారన్నారు నూతన వ్యక్తులకు ఎవరికి కూడా బ్యాంకు ఖాతా నెంబర్లను చెప్పవద్దన్నారు. మీకు అనుమానం వస్తే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చన్నారు.